మెగా ఇంట అడుగుపెట్టనున్న బుల్లి వారసుడు.. తండ్రి కాబోతున్న రామ్ చరణ్!

మెగా ఇంట బుల్లి వారసుడి కోసం గత పది సంవత్సరాలుగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే మెగా అభిమానుల కోరిక అతి త్వరలోనే నెరవేరబోతుందని తెలుస్తోంది.

రామ్ చరణ్ 2012 వ సంవత్సరంలో ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది.

వీరి వివాహం జరిగి 10 సంవత్సరాల అయినప్పటికీ ఇంకా పిల్లలు లేకపోవడంతో మెగా అభిమానులు ఎంతో నిరోత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని వార్త తెలియగానే మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని వార్త తెలియగానే మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

ఉపాసన రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారని తాజాగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారకంగా తెలియజేశారు.

ట్విట్టర్ వేదికగా చిరంజీవి ఈ విషయం గురించి స్పందిస్తూ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని అధికారికంగా వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత పది సంవత్సరాల నుంచి ఈ గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిజంగానే పండగలా ఉందని చెప్పాలి.

2022 వ సంవత్సరం మెగా అభిమానులకు అన్ని శుభవార్తలే తెలియడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.