రామ్ చరణ్ 17.. ఆ రోజే అసలు క్లారిటీ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత ఆచార్య సినిమాతో ఊహించిన విధంగా ఒక డిజాస్టర్ అయితే ఎదుర్కొన్నాడు.

తండ్రి సినిమా అయినప్పటికీ కూడా అందులో చరణ్ కూడా కొంత ఫ్లాప్ టాక్ అయితే మూటకట్టుకోవాల్సి వచ్చింది.

అయితే ఇప్పుడు తదుపరి సినిమాతో ఎలాగైనా సక్సెస్ ఎందుకని ట్రాక్లోకి రావాలి అని చూస్తున్నాడు.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందా? లేదా అంతకంటే ముందే వస్తుందా అనే విషయంలో అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతం షూటింగ్ పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి.

అయితే రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది.

అయితే మరోవైపు రాంచరణ్ తేజ్ తన 17వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వాలి అని రెడీ అవుతున్నట్లు సమాచారం.

కన్నడ దర్శకుడు నార్థన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు రామ్ చరణ్ తేజ్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఇన్ని రోజులు వీరి మధ్యలో సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు టాక్. ఇక సినిమా ఫైనల్ స్క్రిప్ట్ తుది దశకు తీసుకువచ్చిన నర్తన్ ఫైనల్ నెరేషన్ కూడా ఇవ్వడానికి కొంత సమయం అడిగాడట.

అయితే రామ్ చరణ్ తేజ్ అన్ని కుదిరితే మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో మార్చి 27వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.