మెగా కుటుంబంలోకి వారసుడు రాకనే ఆస్తి తగాదాలు.. చిరు పట్ల గుర్రుగా ఉన్న కూతుర్లు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి అందరికీ తెలిసిందే.

ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ కొత్త కొత్త పాత్రలను పోషిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక మరొకవైపు మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.

ఇక ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా పాపులర్ అయ్యాడు. ఇలా ప్రస్తుతం తండ్రి కొడుకులు ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉంటున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు చిరంజీవి అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

గత పది సంవత్సరాలుగా మెగా కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా మెగా వారసుడి కోసం ఎదురుచూస్తున్నారు.

రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగిన పది సంవత్సరాలకు మెగా వారసుడు రాబోతున్నట్లు చిరంజీవి తమ అభిమానులకు శుభవార్త తెలియజేశారు.

దీంతో మెగా కుటుంబంతో పాటు మెగా అభిమానులు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు వారసుడు పుడతాడా అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇలా వారసుడి గురించి శుభవార్త తెలిసిన కొన్ని రోజులకే మెగా కుటుంబంలో అలజడి మొదలైనట్లు తెలుస్తోంది.

ఇంతకాలం సంతోషంగా ఉన్న మెగా కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి తన ఇద్దరి కూతుర్లకు ఏమాత్రం లోటు లేకుండా వారికి ఇవ్వవలసినవన్ని ఇచ్చేశాడు.

ఇక తన పేరుపై ఉన్న ఆస్తి మొత్తం రాబోయే వారసుడికి మాత్రమే చెందుతుందని వీలునామా రాయటంతో మెగా కుటుంబంలో గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది.

చిరంజీవి పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం రామ్ చరణ్ బిడ్డకే చెందుతున్నట్లు చిరంజీవి వీలునామా రాయటంతో చిరంజీవి ఇద్దరు కూతుర్లు ఆయన పట్ల చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.