ప్రభాస్ 3.. మిగతా హీరోలు ఓకే ఒక్కటి!

 టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫాన్స్ కు సరికొత్త కిక్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది.

 బాహుబలి తర్వాత కాసేపు గ్యాప్ తీసుకోవడమే కాకుండా వరుసగా రెండు సినిమాలతో నిరాశపరిచిన ప్రభాస్

 ఈసారి మాత్రం వెంట వెంటనే 8 నెలల గ్యాప్ లోనే మూడు బడ్జెట్ సినిమాలను వదలబోతున్నాడు.

 ముందుగా ఆది పురుష్ సినిమా ఈ ఏడది జూన్ లో వస్తూ ఉండగా ఆ తర్వాత మరో మూడు నెలల్లో సలార్ సినిమా రానుంది.

 ఇక అది వచ్చిన తర్వాత 2024 సంక్రాంతికి ప్రాజెక్టు K రాబోతోంది. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రమే రానున్న రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సర్ ప్రైజ్ ఇవ్వనున్నాయి.

 అయితే మిగతా మహేష్ బాబు అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం కేవలం ఒక సినిమాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మహేష్ బాబు 28వ సినిమా ఆగస్టులో వచ్చే అవకాశం ఉంది.

 ఇక అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ వచ్చే ఎడాది మార్చి లేదా ఏప్రిల్లో రానుంది. ఇక ఎన్టీఆర్ సినిమా ఏప్రిల్ కు ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

 రాంచరణ్ సినిమా కూడా 2024 సమ్మర్లో రానుంది. ఏది ఏమైనా కూడా ప్రభాస్ మాత్రం తన ఫ్యాన్స్ అనుకున్నట్లే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అందించబోతున్నాడు.

 ఇక మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ కు కూడా ఒక్క సినిమా ద్వారానే సర్ ప్రైజ్ ఇచ్చినప్పటికీ ప్లాప్ అయితే మాత్రం బాధను మర్చిపోవడం చాలా కష్టం.

 మరో సినిమాకు మళ్ళి చాలా గ్యాప్ వస్తుంది. మరి ఒక్క సినిమాతో వచ్చే హీరోలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.