సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు పొందిన వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు. ముకుంద సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టింది.
ఆ తర్వాత నాగచైతన్య సరసన “ఒక లైలా కోసం” సినిమాలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది.
ఇలా తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది.
ఈ క్రమంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోల సరసన నటించి మెప్పించింది.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ పూజ హెగ్డే జంటగా నటించిన “అలా వైకుంఠపురంలో” సినిమా 2020లో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ద్వారా పూజా హెగ్డే క్రేజ్ మరింత పెరిగింది.
ఈ సినిమా హిట్ అవ్వటానికి సినిమాలోని పాటల కూడా ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ గా నిలిచింది.
ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్ట బొమ్మ పాట ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే ” అలా వైకుంఠపురం” సినిమాలో బుట్ట బొమ్మ పాటను షేర్ చేస్తూ ఒక నోట్ రాసుకుంది.
2020 సంవత్సరంలో ఇదే రోజున ఈ సినిమా విడుదలయ్యింది. దీంతో ఈ సినిమా విడుదలై నేటికి కరెక్ట్ గా మూడు సంవత్సరాలు పూర్తి అయింది.
ఈ సందర్భంగా పూజ హెగ్డే బుట్ట బొమ్మ సాంగ్ వీడియో షేర్ చేస్తూ..” మూడేళ్ల క్రితం ఇదే రోజున అమూల్య క్యారెక్టర్ పుట్టింది.
మూడు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమాకి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.
నేటికీ అలా వైకుంఠపురములో విడుదలై మూడేళ్లు పూర్తి కావడంతో మూడేళ్ల వేడుకలు జరుపుకోవడానికి అల వైకుంఠపురములో సిద్దంగా ఉంది.’
అంటూ బుట్టబొమ్మ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పాట ఎంత ఫేమస్ అయ్యిందంటే బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ పాటకు స్టెప్పులు వేశారు.
ఇక ఈ పాటలో ఉన్న సిగ్నేచర్ స్టెప్పులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ పాట విడుదలైన దగ్గర నుండి పూజ హెగ్డే ని పుట్ట బొమ్మ అంటూ ఆమె అభిమానులు ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు.