బాలీవుడ్ స్టార్ హీరో డేటింగ్ లో ఉన్న పూజా హెగ్డే… షాక్ లో టాలివుడ్ దర్శకుడు?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే తన ఆనందం అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. 

ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన పూజా హెగ్డే హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ తన అందంతో దర్శకనిర్మాతులను ఆకట్టుకొని స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. 

ఇలా తెలుగు, తమిళ్, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా అవకాశాలు అందుకుంటోంది. 

హిందీలో కూడా ఈ అమ్మడికి సరైన హిట్ లేకపోయినా తన అందంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అవకాశాలు అందుకుంటుంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే కాలికి గాయం అవ్వటం వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకుంటుంది. 

తాజాగా పూజా హెగ్డే గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే బాలీవుడ్ స్టార్ హీరోతో డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు సల్మాన్ ఖాన్. 

ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.

అయితే వీరిద్దరి ప్రేమాయణం గురించి సినీ క్రిటిక్ ఉమర్ సైంధూ సైతం డైరెక్ట్ గా రెస్పాండ్ అయ్యారు.

ఈ మేరకు “ఎస్ ఇట్స్ అఫీషియల్ సల్మాన్ తీ పూజ లవ్ ..కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారు” అంటూ ఉమర్ సైంధు ట్విట్ చేశాడు . 

అయితే అతను ఇలాంటివి చేయడంతో ఒక్కసారిగా బాలీవుడ్ మీడియా షేక్ అయింది. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే పూజా హెగ్డే స్పందించాల్సి ఉంటుంది. 

ఇదిలా ఉండగా పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ ప్రేమాయణం గురించి వార్తలు వినిపిస్తున్న తరుణంలో కొంతమంది నెటిజన్స్ స్పందిస్తూ…

ఈ విషయం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కి తెలిస్తే నీ సంగతి అంతే అంటూ కామెంట్లు చెస్తున్నారు. అయితే పూజా హెగ్డే లవ్ కి త్రివిక్రమ్ కి ఉన్న సంబంధం ఏమిటో మరి.