టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ స్టార్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్న చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో చేయనున్న సంగతి అందరికీ తెలుసు.
అయితే ఈ చిత్రం రెండో షెడ్యూల్ స్టార్ట్ కావడానికి సిద్ధంగా ఉండగా రీసెంట్ గానే ఈ షూటింగ్ డేట్ అలాగే హీరోయిన్ శ్రీ లీల కి సంబంధించి పలు గాసిప్స్ వచ్చాయి.
మరి ఈ గాసిప్స్ చిత్ర నిర్మాత నాగవంశీ లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేయడం ఆసక్తిగా మారింది.
అయితే ఈ చిత్రంలో మొదటగా పూజా హెగ్డే హీరోయిన్ గా లాక్ చేయగా తర్వాత కొత్త సెన్సేషన్ శ్రీ లీల మహేష్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
అయితే నాగవంశీ మాట్లాడుతూ ఇద్దరూ కూడా ఈ చిత్రంలో ఉన్నారని కన్ఫర్మ్ చేశారు.
అంతే కాకుండా ఇద్దరు సినిమాలో ఎవరు మెయిన్ అనేది చెప్పడం కూడా ఆసక్తిగా మారింది. సినిమాలో ఎవరూ ఫస్ట్ హీరోయిన్ కాదట.
సినిమాలో ఇద్దరు హీరోయిన్ మాత్రమే అని ఒకరు ఫస్ట్ హీరోయిన్ ఒకరు సెకండ్ హీరోయిన్ అని ఎవరు లేరు ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే అని తెలిపారు.
అయితే మొదటిలో ఎలాగో పూజా హెగ్డే మాత్రమే మెయిన్ అని అందరికీ అర్ధం అయ్యింది.
కానీ లేటెస్ట్ గా ఈ కామెంట్స్ తో పూజా హెగ్డే కి సమానంగా శ్రీ లీల రోల్ కూడా డిజైన్ చేశారా అనే అనుమానం ఇప్పుడు కలుగుతుంది.
మొత్తానికి అయితే పూజా హెగ్డే రేంజ్ కి శ్రీ లీల వచ్చేసింది అని చెప్పాలేమో..