పవన్ ఈ రీమేక్ మరింత ఆలస్యం.?

 గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తదుపరి చిత్రాల్లో

 సైలెంట్ గా ముహూర్తం ఫిక్స్ చేసేసుకున్న చిత్రం వినోదయ సీతం రీమేక్ కూడా ఒకటి.

 కాగా ఈ సినిమాలో పవన్ చాలా లిమిటెడ్ రోల్ లోనే కనిపించనుండగా దర్శకుడుగా నటుడు సముద్రఖని పని చేయనున్నారు.

 అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అయితే ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించనున్నాడు.

 మరి ఇది రీమేక్ అయ్యినప్పటికీ పవన్ సినిమాకి ఉండే రేంజ్ అంచనాలు ఉన్నాయి.

 కాగా ఈ సినిమా కోసం  గతంలో పవన్ కళ్యాణ్ “గోపాల గోపాల” కి తీసుకున్న కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని తెలిసింది..

ఆ సినిమాలో తాను శ్రీకృష్ణ పరమాత్మ పాత్ర పోషించగా ఆ షూట్ సమయంలో మరియు సినిమాకి కమిట్ అయ్యి ఉన్నపుడు ఎలాంటి మాంసాహారం తీసుకోలేదు.

 ఇప్పుడు ఈ సినిమాలో కూడా తాను దేవుని పాత్ర చేస్తుండడంతో ఇప్పుడు కూడా పవన్ మళ్ళీ మాంసాహారం ముట్టకుండా శాకాహారం తోనే సినిమా చేయనున్నారట.

 ఇక ఈ సినిమా షూటింగ్ పై మరో అప్డేట్ తెలుస్తుంది.ఈ షూటింగ్ కాస్త ఆలస్యంగా స్టార్ట్ అవుతుందట.

  నిజానికి ఈ వారం లోనే స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా మరో రెండు వారాలు వాయిదా పడినట్టుగా తెలుస్తుంది.

 అలాగే హరిహర వీరమల్లు కి కూడా పవన్ బ్రేక్ ఇచ్చారట.

 ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తుండగా మరో వారం రోజుల్లో సినిమా షూట్ స్టార్ట్ కానున్నట్టుగా భోగట్టా..