సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ మార్చి లేదంటే ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.
ఇక గ్యాంగ్ స్టార్ కథాంశంతో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీని దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకముందే ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తుంది.
ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా లెవల్ లో భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకొని రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని దక్కించుకున్న నిర్మాత డివివి దానయ్య
ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా అదే స్థాయిలో పెట్టడానికి రెడీగా ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది.
ఇక ఓజీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కి ఏకంగా 75 కోట్ల రెమ్యునరేషన్ ని దానయ్య ఇస్తున్నాడని తెలుస్తుంది.
ఇక రెమ్యునరేషన్ తో పాటు సినిమా రిలీజ్ అయ్యాక లాభాలలో వాటా కూడా ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక సుజిత్ కి కూడా ఈ మూవీ కోసం రెమ్యునరేషన్ గట్టిగానే ఇస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. దీంతో పాటు ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేసినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్
కి కూడా లాభాల్లో ఒక వాటా ఇవ్వడానికి డివివి దానయ్య ఒప్పుకున్నారని ఇన్ సైడ్ టాక్.
పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తో పాటు సినిమాకి సుమారు 175 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని భావిస్తున్నారు.
అయితే డివివి దానయ్య ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా మార్కెట్ ని అంచనా వేసారు కాబట్టి
అంత బడ్జెట్ పెట్టిన కూడా కచ్చితంగా మంచి లాభాలు తెచ్చుకునే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.
అలాగే దర్శకుడు సుజిత్ కి కూడా సాహో సినిమాతో బాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది
ఈ నేపధ్యంలో అతని ఇమేజ్ కూడా మూవీకి బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందని నమ్మకంతోనే నిర్మాత డివివి దానయ్య ఆ స్థాయిలో బడ్జెట్ పెట్టడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.