టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆరుగురు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ఉన్నా రాజకీయాల విషయానికి వస్తే ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ ఇద్దరు హీరోలు రాజకీయాల్లో సంచలనాలు సృష్టించగల సామర్థ్యం ఉన్న హీరోలు కాగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాజకీయాలలో యాక్టివ్ కాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో యాక్టివ్ కావాలని మరి కొందరు కోరుకుంటున్నారు.
అయితే ఈ ఇద్దరు హీరోలకు తెలుగు రాష్ట్రాలలో సీఎం అయ్యే స్థాయిలో ప్రతిభ ఉంది. ఈ ఇద్దరు హీరోలలో ఎవరు సీఎం అవుతారో అనే చర్చ జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చినా టీడీపీ తరపున పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. తాత స్థాపించిన పార్టీ కావడంతో ఈ పార్టీపై తారక్ కు మమకారం ఉంది.
మరోవైపు జనసేన ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో సంచలనాలు సృష్టిస్తుందని పవన్ నమ్ముతున్నారు.
సాధారణ ప్రజల నమ్మకాన్ని సైతం గెలుచుకుంటే పవన్ సీఎం కావడం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పవన్, ఎన్టీఆర్ కలిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ కాంబినేషన్ లో సినిమా అంటేనే ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు.
ఈ కాంబో రాజకీయాల్లో కలిసి పని చేస్తే మాత్రం మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ రేర్ కాంబో కలిసి పని చేసే అవకాశాలు అయితే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వీళ్లిద్దరూ జగన్ కు గట్టి పోటీ ఇస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఏపీ రాజకీయాల గురించి మరింత ఎక్కువగా చర్చ జరిగే అవకాశాలు ఉంటాయి.