క్రిష్ ని టెన్షన్ పెడుతున్న పవన్ కళ్యాణ్

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైపు జనసేన పార్టీతో రాజకీయాలు చేస్తున్నారు. మరో వైపు వరుసగా సినిమాలు ఒప్పుకొని వాటిని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు.

 ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉంది. ఇంకా 40 శాతంకి పైగా షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తుంది.

 ఇదిలా ఉంటే సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ ఓపెనింగ్ అయిపొయింది. ఇక తాజాగా వినోదాయ సీతమ్ మూవీ షూటింగ్ కి పవన్ కళ్యాణ్ మొదలు పెట్టడం విశేషం.

 ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నడుస్తుంది. దీనికోసం 25 రోజులు పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

 ఇక ఈ మూవీని మార్చి 14న ప్లీనరీ సమయానికి పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

 ఏప్రిల్ నెలలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.

 ఇలా వరుస సినిమాలు పెట్టుకోవడం వలన మరల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కి పవర్ స్టార్ గ్యాప్ తీసుకున్నాడు అని తెలుస్తుంది.

 ఇప్పటికే రెండేళ్ళ నుంచి క్రిష్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ మీద ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ సమావేశాల కారణం

 షూటింగ్ ప్రారంభం కావడం వారం రోజులు కూడా జరగకుండానే మళ్ళీ వాయిదా పడటం జరుగుతుంది అనే మాట వినిపిస్తుంది. అయితే ఇప్పుడు పొలిటికల్ సమావేశాలు పెట్టకపోయిన

 మిగిలిన షూటింగ్ ల కోసం వరుసగా కాల్ షీట్స్ ఇవ్వడం వలన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది.

 అయితే షూటింగ్ వాయిదా పడటంతో క్రిష్ పోస్ట్ ప్రొడక్షన్ పైన దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇలా పవన్ కళ్యాణ్ వరుసగా హరిహరవీరమల్లు షూటింగ్ వాయిదా వేస్తూ ఉండటం వలన

 క్రిష్ కాస్తా టెన్షన్ పడుతున్నట్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వినోదాయ సీతమ్ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు

 మరల హరిహర వీరమల్లు సినిమాపై దృష్టి పెట్టకపోవడం వలన కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నట్లుగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో మాట్లాడుకుంటున్నారు.