బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో మనకు తెలిసింది.
ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకోగా అంతకుమించి రెండవ సీజన్ ప్లాన్ చేశారు.
అయితే మొదటి సీజన్లో కేవలం సినిమా సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానించారు.
కానీ రెండవ సీజన్ కి మాత్రం సినీ సెలెబ్రెటీలతోపాటు రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించారు. దీంతో రాజకీయాల గురించి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.
ఇకపోతే గత కొద్ది రోజులుగా బాలయ్య షోలో పవన్ కళ్యాణ్ సందడి చేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలలో ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ కార్యక్రమం పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఒకవేళ పవన్ ఈ కార్యక్రమానికి వస్తే బాలయ్య తనని ఎలాంటి ప్రశ్నలు వేస్తారు.
సినిమాల పరంగా రాజకీయాల పరంగా బాలయ్య పవన్ కళ్యాణ్ కు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుబోతున్నారనే ఊహగానాలు ఎక్కువయ్యాయి.
అయితే తాజాగా నేడు బాలయ్య టాక్ షోలో పవన్ కళ్యాణ్ సందడి చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ టాక్ షో ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ నేడు మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఈ షోకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఎపిసోడ్ ప్రసారం చేయనున్నట్టు సమాచారం.