యూనిట్ టెస్ట్ లు వద్దంటున్న పవన్!!

 ప్రస్తుతం ఏపీలో రాజకీయం మాంచి రంజుగా సాగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అటు అధికారపక్షం – ఇటు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు, అరెస్టులు,

 వార్నింగులు, ఛాలెంజ్ లు సాగుతున్న పరిస్థితి. మరోపక్క పార్టీలు మారే “గోపి” లతో మరోరకమైన సందడి నెలకుంది! ఇంతజరుగుతున్నా…

 జనసేనాని సందడి మాత్రం కరువైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు!అసలు జనసేన అధినేతపై ఆ సామాజికవర్గ నేతలు, ప్రజలు,

 మరి ముఖ్యంగా జనసైనికులు పెట్టుకున్న ఆశలకు న్యాయం చేసే స్థాయిలో పవన్ రాజకీయాలు ఉండటం లేదనేది ప్రస్తుతం పవన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద విమర్శ!

 ఈ క్రమంలో.. వారాహి అని ఒక బస్సును సైతం సిద్దం చేసుకున్న పవన్.. ఆ బస్సును రోడ్డెక్కించడానికి మాత్రం ముహూర్తాలు చూసుకుంటున్నట్లుగా ఆలస్యం చేస్తున్నారు.

 జగన్ ముందస్తుకు రాకపోతే కావాల్సినంత సమయం ఉందని భావించొచ్చు కానీ… ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు గనుక వస్తే.. సపోజ్ – ఫర్ సపోజ్..

 ఆ ఫలితాలిచ్చిన ఉత్సాహంతో జగన్ ముందస్తుకు వస్తే.. అప్పుడు పవన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందనేది మరో కామెంట్!ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న పవన్…

 ఎన్నికలకు చివరి ఐదునెలలో – ఆరునెలలో ఏపీలో తిరగాలని ప్లాన్ చేస్తున్నారంట. అప్పటికి “యువగళం” పై కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి..

 అనంతరం వారాహిని రోడ్డెక్కించాలని ఆలోచిస్తున్నారంట! దీంతో.. ప్రస్తుతానికి నిరాసతో కొట్టిమిట్టాడుతున్నారు జనసైనికులు!దీంతో… యూనిట్ టెస్ట్ లు రాసేది లేదు..

 ఇంక ఏకంగా ఒకేసారి ఫైనల్ పరీక్షలు రాసేస్తానని అనడం ఎంతవరకూ కరెక్ట్ అనేది జనసైనికుల ఆవేదనగా ఉంది! స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు..

 కొన్ని సీట్లు గెలిచినప్పుడు.. కేడర్ లో కనిపించిన ఉత్సాహం.. మొత్తం మళ్లీ కనుమరుగైపోయిందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ పోటీ చేసిఉంటే..

 రాజ్యాధికారమే లక్ష్యంగా పవన్ ముందుకు వస్తారా.. లేక, ఎప్పటిలాగానే “గెస్ట్ అప్పీరియస్ ఫర్ బాబు” లానే చేస్తారా అన్నది వేచి చూడాలి!!