పట్టాభికి ప్రమోషన్ రెడీ.. కానీ…!

 ప్రస్తుతం ఏపీలో గన్నవరం వ్యవహారం ఇంకా చల్లారలేదు. ఇప్పటికే ప‌ట్టాభితో పాటు 13 మంది టీడీపీ నేత‌ల‌ను రిమాండ్ కి పంపిన సంగతి తెలిసిందే.

 అయితే… వారిలో కేవ‌లం పట్టాభిని మాత్ర‌మే పోలీసులు చిత‌క్కొట్టారని టీడీపీ నేతల ఆరోపణ. అందుకు గల కారణాల సంగతి కాసేపు పక్కనపెడితే…

 ఈ ఎఫెక్ట్ తో పట్టాభికి ప్రమోషన్ రాబోతోందని అంటున్నారు తమ్ముళ్లు! ఒక్కసారి వెనక్కి వెల్తే.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అరెస్టు కాబడిన అచ్చెన్నాయుడికి కూడా

 ఆ ఎఫెక్ట్ అనంతరమే ఏపీ టీడీపీ అధ్యక్షుడి పదవి వరించింది! అంటే… అప్పటికి అచ్చెన్నకు ఉన్న అర్హతలకంటే… పోలీసుల ఎఫెక్ట్ బాగా పని చేసిందన్నమాట! ఇదే క్రమంలో..

 తాజాగా పట్టాభిని పోలీసులు పట్టుకెళ్లారు! ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు! దీంతో… పట్టాభి బయటకు వచ్చిన అనంతరం.. గన్నవరం ఎమ్మెల్యే టిక్కెట్టు ఆఫర్ చేసి,

 కాస్త శాంతి పరచాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారంట. దీంతో… వంశీ & కో కి థాంక్స్ చెబుతున్నారు పట్టాభి ఫ్యాన్స్!

 కాగా… గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ కూడా గత ఎన్నికల్లో టీడీపీ నుంచే గెలిచారు!!

 కాకపోతే… ప‌ట్టాభి రాం మీడియాలో మాట్లాడ్డానికి త‌ప్ప‌, ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు ఏమాత్రం ప‌నికి రార‌నేది కొందరు టీడీపీ సీనియర్ నేత‌ల అభిప్రాయంగా ఉందట! మరి…

 బాబు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాలంటే కనీసం రిమాండ్ పూర్తయ్యేవరకైనా వేచి చూడాల్సిందే!!