యూఎస్ లో “RRR” కి కొట్టేసిన “పఠాన్” లేటెస్ట్ వసూళ్లు.!

గత ఏడాది టాలీవుడ్ దగ్గర మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన సినిమాలు ఎక్కువే వచ్చాయి.

మరి ఆ సినిమాల్లో దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మాసివ్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ ఒకటి కాగా

ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ లతో చేసిన ఈ చిత్రం 1100 కోట్లకి పైగా వసూళ్లు అందుకుని ఇండియా సినిమా దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్ లలో ఒకటిగా నిలిచింది.

కాగా ఈ సినిమా యూఎస్ లో కూడా సెన్సేషనల్ రన్ ని అందుకుంది. బాహుబలి 2 ని అయితే ఇది టచ్ చేయలేదు కానీ అక్కడ టాప్ 2 లో ఈ సినిమా నిలిచింది.

మరి ఈ చిత్రం యూఎస్ లో 14.8 మిలియన్ డాలర్స్ ని రాబట్టగా

ఈ లైఫ్ టైం వసూళ్ళని బాలీవుడ్ భారీ కం బ్యాక్ సినిమా అయినటువంటి “పఠాన్” చిత్రం 15 మిలియన్ డాలర్స్ తో ఇప్పుడు దీనిని క్రాస్ చేసేసింది.

దీనిని ఈ చిత్రం కేవలం 16 రోజుల్లోనే దాటేయడం విశేషం. అయితే అక్కడ RRR సినిమా అయ్యిన రీ రిలీజ్ లు అన్నీ కలిపి వచ్చిన వసూళ్ళని షారుఖ్ ఖాన్ పఠాన్ అయితే కొల్లగొట్టేసింది.

దీనితో యూఎస్ లో కూడా పఠాన్ సినిమా ఇప్పుడు బాహుబలి 2 తర్వాత రెండో సినిమాగా నిలిచింది.

అయితే బాహుబలి 2 యూఎస్ లో సుమారు 20 మిలియన్ డాలర్స్ వసూలు చేసి ఆల్ టైం నెంబర్ 1 ఇండియన్ సినిమా గ్రాసర్ గా ఉంది.

మరి దీనిని కూడా పఠాన్ అందుకుంటుందో లేదో చూడాలి. కాగా ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు.