బాలీవుడ్ లో భారీ రికార్డు సెట్ చేసిన “పఠాన్” బుకింగ్స్.!

  గత కొంత కాలం నుంచి హిందీ ఇండస్ట్రీ లో తమ రేంజ్ కి తగ్గ బాక్సాఫీస్ సక్సెస్ అయితే మళ్ళీ రాలేదు

 జస్ట్ ఈ రెండేళ్లలో కేవలం వేలిమీద లెక్కేసే సినిమాలే హిట్ అయ్యాయి అంటే నమ్ముతారా?

 ఆ రేంజ్ లో సంక్షోభం బాలీవుడ్ లో నెలకొంది. కానీ ఫైనల్ గా మాత్రం బాలీవుడ్ కోరుకున్న ఆ పూర్వ వైభవాన్ని

 మళ్ళీ హిందీ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం తీసుకొచ్చింది.

 భారీ లెవెల్లో అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని వార్, బ్యాంగ్ బ్యాంగ్ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు.

 మరి ఇలా హిందీలో వచ్చిన ఈ చిత్రం అయితే పోస్ట్ పాండమిక్ భారీ రికార్డు సెట్ చేసినట్టుగా తెలుస్తుంది.

 హిందీలో ఈ సినిమాకి బుకింగ్స్ అయితే పాన్ ఇండియా హిట్ కేజీఎఫ్ 2 బుకింగ్స్ ని దాటేశాయి.

 అయితే ఆ సినిమా సీక్వెల్ కాగా హైప్ వేరే లెవెల్లో ఉంది కానీ ఇక్కడ మొదటి సినిమా అయినప్పటికీ షారుఖ్ ఖాన్ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు.

 ఇక కేజీఎఫ్ హిందీ టౌన్ లో 5 లక్షల 15వేల టికెట్స్ రిలీజ్ డేట్ నాటికి బుక్ చేసుకోగా దీనిని పఠాన్ చిత్రం బ్రేక్ చేసింది.

 మరి పఠాన్ కి అయితే ఏకంగా 5 లక్షల 21 వేలకి  ఆన్లైన్ లో బుక్ అయ్యాయి దీనితో హిందీలో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.

 ఇక డబ్బింగ్ నుంచి వచ్చిన చిత్రాల్లో అయితే బాహుబలి 2 6 లక్షల 50వేల టికెట్స్ బుకింగ్స్ తో ఇప్పటికీ ప్రథమ స్థానంలో ఉంది.