లేటెస్ట్ వసూళ్లతో బి టౌన్ లో ఇండస్ట్రీ హిట్ గా “పఠాన్”.!

 బాలీవుడ్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ అవైటెడ్ భారీ హిట్ అయితే ఇప్పుడు ఎట్టకేలకు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ రూపంలో అయితే వచ్చేసింది.

 తాను హీరోగా చేసిన జీరో ప్లాప్ అయ్యి నాలుగేళ్ల తర్వాత వచ్చిన సినిమా ఇది కావడంతో దీనిపై ఎనలేని హైప్ రావడం అందుకు తగ్గట్టే సినిమా సూపర్ హిట్

 టాక్ తెచ్చుకోవడంతో అయితే సెన్సేషనల్ వసూళ్లు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా నమోదు అయ్యాయి.

 లేటెస్ట్ వ అయితే ఈ సినిమా దెబ్బకి బాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులు బద్దలు కాగా ఇప్పుడు బి టౌన్ లో అయితే ఈ సినిమా డైరెక్ట్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది.

 ఇక్కడ డైరెక్ట్ అని ఎందుకు వచ్చింది అంటే కేవలం హిందీ సినిమాలు పరిగణలో తీసుకుంటే

 ఈ చిత్రం బాలీవుడ్ లో హైయెస్ట్ వసూళ్లు ఉన్న చిత్రం “దంగల్” ని ఇది క్రాస్ చేసి ఇప్పుడు హిందీలో హైయెస్ట్ వసూళ్లు ఉన్న సినిమాగా నిలిచి ఆల్ టైం హిట్ గా నిలిచింది.

 కాగా దంగల్ కి లైఫ్ టైం లో 380 కోట్ల గ్రాస్ ని రాబట్టగా పఠాన్ దీనిని కేవలం ఈ రెండో వీకెండ్ కి కొట్టేసినట్టు ట్రేడ్ వర్గాలు కన్ఫామ్ చేశారు.

 దీనితో బాలీవుడ్ లో ఈ సినిమా అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది.

 ఒక ఓవరాల్ హిందీ వెర్షన్ లో అయితే బాహుబలి 2 మరియు కేజీఎఫ్ సినిమాల వెనక ఇది ఉండి టాప్ 3 లో ప్రస్తుతానికి ఉంది.

 మరి లైఫ్ టైం వసూళ్ళలో అయితే వీటిని క్రాస్ చేస్తుందో లేదో అనేది ఇప్పుడు అక్కడ ఆసక్తిగా మారింది.

 ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా బాంగ్ బాంగ్, వార్ సినిమాల ఫేమ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాని తెరకెక్కించాడు.