కొన్నాళ్ళ క్రితం ‘కొబ్బరి చట్నీ’ లీక్ ద్వారా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అడ్డంగా బుక్కయిపోయిన సంగతి తెలిసిందే.
కొన్నాళ్ళ క్రితం ‘కొబ్బరి చట్నీ’ లీక్ ద్వారా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అడ్డంగా బుక్కయిపోయిన సంగతి తెలిసిందే.
నారా లోకేష్ విషయంలో అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ఆ లీకు సారాంశం. ‘టీడీపీ పనైపోయింది..’
అంటూ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అచ్చెన్న చేసినట్లుగా ఓ ఆడియో మరియు వీడియో క్లిప్ బయటకు వచ్చింది.
తాజాగా, నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర విషయంలోనూ, అచ్చెన్నాయుడిదిగా చెప్పబడుతున్న ఓ ఆడియో లీక్ అయ్యింది.
టీడీపీలో చాలామంది ముఖ్య నాయకులు మాట్లాడుకునే మాటలే అవి. ‘యువగళం పాదయాత్ర’ అట్టర్ ఫ్లాప్ అన్న చర్చ టీడీపీలో జరుగుతోంది.
ఆ విషయాన్నే అచ్చెన్నాయుడు కూడా మాట్లాడి వుండొచ్చు. లేదంటే, ఇదంతా రాజకీయ కుట్రే అయి వుండొచ్చు. ఏదైనాగానీ, అచ్చెన్నాయుడి పేరే ఎందుకు ప్రతిసారీ ఇలా వివాదాస్పదమవుతోంది.?
ఈ విషయమై అచ్చెన్న కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. టీడీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాడు.
ఆ మధ్య ఈఎస్ఐ మెడికల్ స్కామ్ వ్యవహారంలో అరెస్టయ్యాక.. అచ్చెన్నాయుడి పేరు మరింత మార్మోగిపోయింది.
ఆ తర్వాతే ఆయనకు పార్టీలో ప్రాధాన్యత మరింత పెరిగింది. ఏం లాభం.? ఇది గిట్టనోళ్ళు పనిగట్టుకుని అచ్చెన్న పేరుతో లీకులు బయటకు వదులుతున్నారు.
జగన్ మీద ఎంత గింజుకుని అచ్చెన్న ఆరోపణలు చేసినా, తెలుగు తమ్ముళ్ళే ఫాపం.. అచ్చెన్నాయుడిని నమ్మడంలేదాయె.!