గత ఏడాది లాస్ట్ నెలలో ఇదే ఫినిషింగ్ భారీ హిట్ అన్నట్టుగా వచ్చిన చిత్రమే మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన చిత్రం “ధమాకా”.
దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రం కితం నెల క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యి ఇప్పుడు సంక్రాంతి బరిలో కూడా భారీ వసూళ్లు హౌస్ ఫుల్స్ తో అదరగొట్టింది.
ఇలా రవితేజ కెరీర్ లోనే ఓ భారీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఫైనల్ గా థియేటర్స్ లో ఫైనల్ రన్ కి చేరుకుంటుంది. ఇక ఈ సినిమా అయితే లేటెస్ట్ గా ఓటిటి లో రిలీజ్ కి సిద్ధం అయ్యింది.
ఈ సినిమాని ప్రముఖ పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తెలుగు మరియు హిందీ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకోగా.
ఇప్పుడు అధికారికంగా మరోసారి నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా అయితే లేటెస్ట్ ట్రైలర్ తో ఈ జనవరి 22 నుంచే అంటే రేపటి నుంచే స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతానికి ఈ చిత్రం థియేటర్స్ లో బాగానే రాణిస్తుంది కానీ ఒక నెలలోనే వచ్చేయడం బాధాకరమే అని చెప్పాలి.
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించగా భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.
అలాగే జైరాం, రావు రమేష్, పవిత్ర లోకేష్ తదితరులు సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.