ఆల్రెడీ సినిమాని లాంఛనంగా ప్రారంభించేశారు చాన్నాళ్ళ క్రితమే.! కానీ,
అభిమానుల కోసం ప్రారంభోత్సవాన్ని ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ఇంతలోనే, పెద్ద అవాంతరం వచ్చి పడింది.
యంగ్ టైగర్ ఎన్టీయార్ – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా (ఎన్టీయార్ 30) విషయమై సర్వత్రా జరుగుతోన్న చర్చ ఇది.
నందమూరి తారకరత్న అకాలమరణం నేపథ్యంలో, ఈ నెల 24న జరగాల్సిన ‘ఎన్టీయార్ – కొరటాల శివ’ సినిమా ప్రారంభోత్సవం
వాయిదా పడిన సంగతి తెలిసిందే. ‘ఇక ప్రారంభోత్సవాలేమీ వద్దు.. నేరుగా సెట్స్ మీదకు వెళ్ళిపోదాం..’ అని యంగ టైగర్ ఎన్టీయార్, దర్శకుడు కొరటాల శివకి తేల్చి చెప్పాడట.
మరోపక్క, అసలు ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్ళడం ఎంతవరకు సబబు.? అని అభిమానుల్లో డౌటానుమానాలు బయల్దేరాయి.
‘ఇన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయంటే, సినిమా చేయడం మంచిది కాదనే కదా.?’
అన్న అనుమానాలకు ఆస్కారమేర్పడిందిప్పుడు. అదే బాలయ్య అయితే, ఆయనకు సెంటిమెంట్లెక్కువ గనుక.. ప్రాజెక్టునే రద్దు చేయించేవాడేమో.!