ప్రభుదేవా అలా చేయటం వల్లే నయనతార అతన్ని పెళ్లి చేసుకోలేదు..? 

 సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమైన నయనతార ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోల సరసన నటించింది.

 ఇలా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.

 ఇలా సినిమాల ద్వారా మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాల వల్ల కూడా నయనతార బాగా పాపులర్ అయింది. కోలీవుడ్ స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపింది.

 మొదట హీరో శింబు తో ప్రేమాయణం నడిపిన నయనతార ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పింది. శింబు కి దూరమైన నయనతార కొంతకాలం సినిమాల మీద బాగా దృష్టి పెట్టింది.

 ఈ క్రమంలో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది.

 ప్రభుదేవా కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి నయనతారని రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే వీరి మధ్య ఏం జరిగిందో కానీ పెళ్లి మాత్రం ఆగిపోయింది.

 అయితే నయనతార ప్రభుదేవా అని పెళ్లి చేసుకోకపోవటానికి ప్రభుదేవా మొదటి భార్య కారణం అని వార్తలు వినిపించాయి.

 అంతేకాకుండా మరొక విషయం వల్ల కూడా నయనతార ప్రభుదేవా అని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని వార్తలు వైరల్ అయ్యాయి.

  క్రిస్టియన్ కుటుంబానికి చెందిన నయనతార ని పెళ్లి చేసుకోవడానికి ప్రభుదేవా కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

 క్రిస్టియన్ నుండి హిందువుగా మతం మార్చుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటారని హిందువుగా తన మతం మార్చుకుంది.

 అయినప్పటికీ చిన్నచిన్న విషయాలకు కూడా ప్రభుదేవా నయనతారకు ఆంక్షలు విధిస్తూ తాను చెప్పినట్లే నడుచుకోవాలని నియమాలు పెట్టడంతో ప్రభుదేవాతో పెళ్లికి నయనతార నిరాకరించినట్లు వార్తలు వినిపించాయి.

 ఇక ప్రభుదేవా తో పెళ్లి క్యాన్సిల్ అవ్వటంతో నయనతార సినిమాల మీద దృష్టి పెట్టింది. ఇక కొంతకాలం క్రితం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ఇటీవల అతన్ని వివాహం చేసుకుంది.

 అంతేకాకుండా వీరు సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు కూడా జన్మనిచ్చారు.