హాలీవుడ్ భారీ సినిమాల డైరెక్టర్ ని మెప్పించిన “నాటు నాటు”

హాలీవుడ్ లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు అలాగే మరెన్నో సరికొత్త సృష్టి చిత్రాలు రూపొందించిన దర్శకుల్లో స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా ఒకరు.

ఒక “జురాసిక్ పార్క్” కానీ ఒక “జాస్”, “ఇండియానా జోన్స్” లాంటి భారీ చిత్రాలు చేసి హాలీవుడ్ లో ఎన్నో ప్రయోగాలకి తెర తీశారు.

మరి ఇలాంటి దర్శకుడు మన ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్ర యూనిట్ ని కలవడం క్రేజీ గా మారింది.

ఈ చిత్ర యూనిట్ అంతా ఇప్పుడు యూఎస్ లో ఉండగా పలు ఈవెంట్ లలో హాజరు అవుతున్నారు. మరి ఈ చిత్ర యూనిట్ ని స్టీవెన్ కలవగా రాజమౌళి వ్యక్తం చేసిన ఎగ్జైట్మెంట్ కూడా అంతా ఇంతా కాదు.

ఇక రీసెంట్ గానే ఆర్ ఆర్ ఆర్ సెన్సేషనల్ హిట్ సాంగ్ నాటు నాటు హాలీవుడ్ అవార్డు అందుకోగా ఇప్పుడు మరో విషయం మేకర్స్ పంచుకున్నారు.

ఈ సాంగ్ అయితే దర్శకుడు స్టీవెన్ కూడా మెచ్చుకున్నారని తనకి ఎంతో నచ్చింది అని చెప్పడం సినిమా సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి లేటెస్ట్ గా తెలిపారు.

ఈ అంశం నేను నమ్మలేకపోతున్నానని కూడా షేర్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో మన టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇవి కూడా మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.