సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులతో ఆస్కార్ అవార్డ్ చాలా ప్రాధాన్యమైనది.
సినిమా గొప్పతనాన్ని తెలుపుతూ ఇచ్చే ఈ ఆస్కార్ అవార్డులకు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ఉత్తమ సినిమాలను ఎంపిక చేస్తారు.
ఈ ఏడాది జరిగే 95 వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చి 13వ తేదీన జరగనుంది.ఇప్పటికే దేశం నలువైపుల నుండి ఎన్నో సినిమాలు ఆస్కార్ నామినేషన్ కి ఎంపిక అయ్యాయి.అంటూ పోస్టు!
చాలాకాలం తర్వాత మన తెలుగు సినిమా కూడా ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటం గర్వకారణం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఏ సినిమాకు ఎన్నో అవార్డులు వరించాయి. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబల్ అవార్డు దక్కింది.
దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఆస్కార్ బరిలో భారతీయ సినిమాకు చోటు దక్కింది. మన ఇండియా నుండి మరో డాక్యుమెంటరీలు ఆస్కార్ బరిలో నిలిచాయి.
ఈ ఏడాది జరిగే 95వ ఆస్కార్ నామినేషన్ లో మన భారతదేశం నుండి మూడు చిత్రాలు ఎంపికవగా .. మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా ఎంపికవటం విశేషం.
ఈ క్రమంలో ఆర్ఆర్ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎట్టకేలకు ‘ సరికొత్త చరిత్ర సృష్టించాం ‘అంటూ పోస్టు చేసింది.
రా రా సినిమా ఆస్కార్ నామినేషన్ లో ఉండటంతో భారతీయ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా రాజమౌళి భారతీయ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు భారతీయ సినీ ప్రముఖులు,
హాలీవుడ్ సినీ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా భారతీయ తెలుగు సినీ చరిత్రకు గర్వకారణంగా ప్రజలుభావిస్తున్నారు. ఆస్కార్ కు ఎంపికైన ‘నాటు నాటు’.. చరిత్ర సృష్టించాం అంటూ పోస్టు!
రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో పాటు కీరవాణి సంగీతం, జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ నటన ప్రతి ఒక్కటి సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయి.