నారా లోకేష్ ’యువగళం‘.! పేరు సరే, ప్రజల్ని ఆకట్టుకోగలరా.?

తెలుగునాట పాదయాత్రలు కొత్తేమీ కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సుదీర్ఘ పాదయాత్రల ట్రెండ్ షురూ అయ్యింది.

 నారా చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేశారు.

 వైఎస్ జగన్ పాదయాత్ర సంగతి సరే సరి. వైఎస్ షర్మిల చేసిన పాదయాత్ర గురించి కూడా ప్రస్తావించుకోవాలి.

 ఇప్పటిదాకా పాదయాత్రలు చేసినవారిలో ఒక్క వైఎస్ షర్మిల తప్ప, అందరికీ ముఖ్యమంత్రి పదవి దక్కింది.

  వైఎస్ షర్మిల పాదయాత్ర చేసిందే వైఎస్ జగన్ కోసం. సో, ఇక్కడ వైఎస్ షర్మిలకు పదవి దక్కలేదనడం సబబు కాదేమో.!

 తన కోసం ఆమె ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు.

 ఆ పాదయాత్ర ఆమెకు అధికారం వచ్చేలా చేస్తుందా.? అన్నది కాలమే నిర్ణయించాలి.

 తెలంగాణలో వైఎస్ షర్మిలతోపాటు, బీజేపీ నేత బండి సంజయ్ కూడా పాదయాత్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు.

 ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారు.

 సుదీర్ఘంగా.. అంటే, 4000 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర చేస్తారట.

 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేపట్టబోతున్నారు నారా లోకేష్. ఈ పాదయాత్రకు ‘యువ గళం’ అని పేరు కూడా పెట్టారు.

 వైఎస్ జగన్ కోసం వైఎస్ షర్మిల పాదయాత్ర చేసినట్లుగా, చంద్రబాబు కోసం నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారు.

 ఈ యువగళం ప్రజల్ని ఆకట్టుకుంటుందా.? టీడీపీకి తిరిగి అధికారం తెస్తుందా.? వేచి చూడాల్సిందే.