నాగార్జున ఒరేయ్ అనే పిలిచే ఏకైక హీరో… ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటుంది!

 సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది హీరోలు దర్శకులు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.

 ఇలా హీరోలు హీరోల మధ్య హీరో దర్శకుల మధ్య ఇలాంటి మంచి స్నేహబంధం కొనసాగుతోంది.

 ఎంతగా అంటే వీరిద్దరూ పేర్లతో కాకుండా ఒరేయ్ అంటూ పిలుచుకునే అంత స్నేహబంధంతో కొనసాగుతూ ఉంటారు.

 ఈ క్రమంలోనే నాగార్జున వెంకటేష్ మధ్య కూడా ఇలాంటి అనుబంధమే ఉందని చెప్పాలి.

 ఇండస్ట్రీలోకి నాగార్జున వెంకటేష్ ఒకేసారి వచ్చినప్పుడు వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం స్నేహంగా మారింది ఇలా వీరిద్దరు ఎప్పుడు కూడా ఒరేయ్ అంటూ ఒకరినొకరు పిలుచుకునేవారు.

 ఈ విధంగా ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండడంతో రామానాయుడు కుమార్తె వెంకటేష్ సోదరి లక్ష్మిని నాగార్జునకు ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు.

 ఈ క్రమంలోని వీరి వివాహం కూడా జరిగింది. వీరి వివాహం జరిగి నాగచైతన్య పుట్టిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య అదే బంధం ఉండేది.

అయితే ప్రస్తుతం మాత్రం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనే కోపతాపాలు మనస్పర్ధలు ఉన్నాయని తెలుస్తోంది.

 అందుకు గల కారణం నాగార్జున వెంకటేష్ చెల్లెలకు విడాకులు ఇవ్వడమే.

నాగార్జున వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని వివాహం చేసుకొని నాగచైతన్య జన్మించిన తర్వాత వీరిద్దరి మధ్య పలు మనస్పర్ధలు తలెత్తాయని దీంతో విడాకులు తీసుకొని విడిపోయారనే విషయం మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడంతో వెంకటేష్ నాగార్జున మధ్య కూడా బేధాభిప్రాయాలు మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది.

అప్పటినుంచి వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని సమాచారం. మంచి స్నేహితులుగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ ఇద్దరి హీరోల మధ్య మనస్పర్ధలు వచ్చి వీరి మధ్య దూరం పెరగడానికి కారణం నాగార్జున విడాకులే అని చెప్పాలి.

 మరి వీరిద్దరి మధ్య ఉన్న ఈ మనస్పర్ధలు ఎప్పుడు తొలగిపోతాయో తెలియాల్సింది.