మంత్రి రోజాకి నోటి దురుసు చాలా చాలా ఎక్కువ. బహుశా రాజకీయంగా ఆమె ఎదగడానికి అది బాగానే ఉపయోగపడి వుండొచ్చు. కానీ, రోజా మాట్లాడుతోంటే, మ్యూట్ పెట్టే స్థితికి వచ్చేసింది వ్యవహారం.!
అంతలా రోజా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు ఇటీవలి కాలంలో. జబర్దస్త్ స్కిట్స్ వరకూ బాగానే వుండొచ్చు.. డిక్కీ బలిసిన కోడి.. లాంటి మాటలు.
కానీ, రాజకీయాల్లో అసహ్యంగా వుంటాయవి. పైగా, మంత్రి అయ్యాక అస్సలు మాట్లాడకూడని మాటలవి. రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించే క్రమంలో నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు రోజా.
మొన్నీమధ్యన చిరంజీవిపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా. దాంతో, నాగబాబు కౌంటర్ ఎటాక్ చేయాల్సి వచ్చింది. మంత్రి రోజా నోటిని మునిసిపాలిటీ చెత్త కుప్పగా నాగబాబు పోల్చారు.
‘చెత్తకుప్ప రోజా’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయిపోయింది కూడా. జనసేన నేతగా నాగబాబు, రోజాని విమర్శించడం ఓ యెత్తు. వైసీపీ నేతగా రోజా, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం ఇంకో యెత్తు.
అవి కేవలం రాజకీయ విమర్శలే కావొచ్చు. కానీ, రోజా ఏదన్నా మాట్లాడితే.. అది ఓ మంత్రిగా మాట్లాడిన మాట అవుతుందన్న ఇంగితం ఆమెకు లేకపోతే ఎలా.?
నాగబాబు కేవలం జనసేన నేత మాత్రమే. ఆయనకేమీ పదవుల్లేవు. ఆయన ఏం మాట్లాడినా, జనసేన పార్టీకి ఫరక్ పడదు. రోజా విషయం అలా కాదు.
రోజా మాట్లాడే మాటల్ని మహిళా లోకం అసహ్యించుకునే పరిస్థితి వస్తే, వైసీపీకి అలాగే వైసీపీ ప్రభుత్వానికీ చాలా నష్టం జరుగుతుంది.
కోవిడ్ కష్టకాలంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల్ని పెట్టి ఎంతోమందికి ప్రాణదాతగా మారారు. ప్రభుత్వంలో వున్నవారు ప్రజాధనంతో ప్రజల్ని ఆదుకునే పని చేస్తే, చిరంజీవి వ్యక్తిగతంగా..
తన సంపాదన నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చిరంజీవితో రోజాని పోల్చగలమా.? రోజాకి ఆ స్థాయి అసలు వుందా.? మహిళల్ని ఎలా గౌరవించాలో నాగబాబు నేర్చుకోవాలన్నది రోజా వాదన.
అది నిజమే కావొచ్చు.. కానీ, మగాళ్ళను గౌరవించడమెలాగో రోజా కూడా నేర్చుకోవాలి కదా.?