తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాకు గాను వరుస అవార్డులు రావడంతో చిత్ర బృందం ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో నాటు నాటు పాటకు గాను తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఇక ఈ అవార్డు అందుకోవడం కోసం చిత్ర బృందం మొత్తం అమెరికా వెళ్ళిన విషయం తెలిసిందే.
ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ తన తండ్రి గత 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారని ఆయన ఫిట్నెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారని తెలిపారు.
ఒకరోజు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని భోజనం చేస్తుండగా ఏంట్రా ఈ మధ్య చాలా బక్క చిక్కిపోయావు అని ప్రశ్నించారు.
అందుకు నేను కూడా తల ఊపుతూ అవును డాడీ అని సమాధానం చెప్పాను. దాంతో ఇడియట్ నేనేదో సరదాగా అన్నాను.
నీ ఫిజిక్ మొత్తం మారిపోయింది కాస్త జిమ్ కి వెళ్ళు అంటూ నన్ను ఉపాసన ముందే తిట్టారు.ఇలా నాన్న తిట్టడంతో ఉపాసన ఏంటి నిన్ను అలా తిట్టేశారని ఆశ్చర్యపోయింది.
అయితే ఇది తిట్టడం కాదు ఇద్దరు నటుల మధ్య జరిగే సంభాషణ అని తనకు చెప్పుకొచ్చానని రామ్ చరణ్ తెలిపారు.
ఇలా తన తండ్రి తనని తిట్టారని రామ్ చరణ్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.