టాలీవుడ్ సీనియర్ హీరో సరసన మృనాల్ ఠాకూర్.?

‘సీతారామం’ సినిమాతో అనూహ్యంగా రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది మృనాల్ ఠాకూర్.

ప్రస్తుతం నాని సరసన ఓ సినిమా చేస్తోందీ బ్యూటీ.

హిందీలోనూ పలు ప్రాజెక్టులున్నాయ్ మృనాల్ చేతిలో. ఇంకోపక్క కన్నడ, తమిళ సినీ పరిశ్రమల నుంచీ మృనాల్ ఠాకూర్‌కి అవకాశాలు పోటెత్తుతున్నాయి.

ఇదిలా వుంటే, టాలీవుడ్‌కి చెందిన ఓ సీనియర్ హీరో, మృనాల్ ఠాకూర్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలుగు సినీ పరిశ్రమ వరకూ ఫ్రెష్ ఫేస్ అయినాగానీ, కాస్త మెచ్యూర్డ్ ఫేస్ కావడంతో, సీనియర్ హీరోల పక్కనా బాగానే సూటయిపోతుంది మృనాల్ ఠాకూర్.

ఈ నేపథ్యంలోనే తన కొత్త సినిమాలో మృనాల్ ఠాకూర్‌కి హీరోయిన్‌గా ఛాన్సిచ్చాడట ఆ సీనియర్ హీరో. ఆయనెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఏప్రిల్‌లో సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోందట ఆ సినిమా ఫుల్ డిటెయిల్స్ బయటకు రావాల్సి వుంది. కోటి వరకూ పలుకుతోందిట మృనాల్ రేటు ప్రస్తుతం.