గత ఏడాది టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మృణాల్ ఠాకూర్ అనే చెప్పాలి.
బాలీవుడ్ లో జెర్సీ సినిమాతో అక్కడ ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకోలేదు కానీ తెలుగులో మాత్రం హీరో దుల్కర్ సల్మాన్ తో అయితే దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం “సీతా రామం”.
ఇక ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ లో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ హీరోయిన్ నెక్స్ట్ ఏ హీరోతో చేస్తుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూసారు.
మరి ఇప్పుడు ఫైనల్ గా అయితే మృణాల్ ఠాకూర్ తన రెండో టాలీవుడ్ సినిమాని లాక్ చేసుకుంది.
లేటెస్ట్ గా వచ్చిన బజ్ ని నిజం చేస్తూ నాచురల్ స్టార్ నాని హీరోగా నటించనున్న చిత్రం తన 30వ సినిమాలో హీరోయిన్ గా చిత్ర యూనిట్
లేటెస్ట్ అనౌన్సమెంట్ వీడియో లో అయితే నాని సరసన ఈ హీరోయిన్ ఫిక్స్ అయ్యినట్టు తెలిపారు.
ఇంకా ఈ సినిమాతో కొత్త దర్శకుడు సౌర్యువ్ పరిచయం అవుతున్నాడు
అలాగే హీషం అబ్దుల్ వహద్ అనే కొత్త సంగీత దర్శకుడు కూడా టాలీవుడ్ కి పరిచయం అవుతూ ఉండగా వైరా క్రియేషన్స్ అనే కొత్త బ్యానర్ కూడా ఈ సినిమాతోనే పరిచయం అవుతున్నారు.
ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే మృణాల్ కూడా మొదట నాని తోనే పరిచయం కావాల్సి ఉంది కానీ లేట్ అయ్యింది.