మొన్న పవన్..ఇప్పుడు చిరు సినిమా నిలిపివేత.!

 టాలీవుడ్ లో కొత్త సినిమాలతో పాటుగా మళ్ళీ పాత సినిమాలు రీ రిలీజ్ అనే ట్రెండ్ తీసుకొచ్చి హిట్ చేసారు.

 అయితే ఈ రీ రిలీజ్అయితే ఈ రీ రిలీజ్ లు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమి కాదు ఎప్పుడు నుంచో ఉన్నాయి కానీ ఇప్పుడు కాలం మారడంతో

 పాత ప్రింట్ లను కొత్తగా అప్డేట్ చేసి రిలీజ్ చేస్తుండడంతో ఓ వారం పాటు సినిమాలు బాగానే ఆడుతున్నాయి.

 కాగా ఈ ట్రెండ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పోకిరి తో స్టార్ట్ చేయగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆల్ టైం రికార్డ్స్ సెట్ చేసి పెట్టారు.

 ఇక పవన్ నుంచి వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి వసూళ్లు అందుకున్నాయి.

 దీనితో మరో రెండు సినిమాలు బద్రి మరియు తొలిప్రేమ చిత్రాలు ప్లానింగ్ కి వచ్చాయి.

 కానీ లాస్ట్ మినిట్ లో ఈ సినిమాలు ఆపేసారు. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి సినిమా

 గ్యాంగ్ లీడర్ ని కూడా ఈ నెలలో రీ రిలీజ్ కి ప్లాన్ చేసి టికెట్స్ కూడా పెట్టారు. కానీ ఎందుకో ఈ సినిమా రీ రిలీజ్ కూడా ఇప్పుడు నిలిచిపోయింది.

  దీనితో బ్యాక్ టు బ్యాక్ మాత్రం ఈ ఇద్దరి మెగా బ్రదర్స్ సినిమాలు వరుసగా నిలిచిపోవడం గమనార్హం.

 అయితే మరోపక్క పెద్దగా గ్యాప్ లు లేకుండా రీ రిలీజ్ లు సందర్భం పాడు లేకుండా రిలీజ్ చేస్తుండడం తో జెనరల్ ఆడియెన్స్ బాగా విస్తుపోతున్నారు.

 మరి వీటికి కొత్త డేట్స్ ఏమన్నా వస్తాయా లేక ఇలాగే నిలిచిపోతాయా అనేది చూడాలి.