మొబైల్ డేటా ఉపయోగించకుండానే తొందరగా పూర్తవుతోందా.. వెంటనే ఇలా చేయండి..?

 ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది

 ఈ ఇంటర్నెట్ వల్ల ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు అందరూ మొబైల్ తోనే తమ సమయాన్ని గడుపుతున్నారు.

 ప్రస్తుతం ప్రతి ఒక్కటి ఆన్లైన్ విధానంలో మారిపోవటం వల్ల ఇంటర్నెట్ తప్పనిసరిగా మారిపోయింది. ఇంటర్నెట్ లేకపోతే ఆ ఫోన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.

 అందువల్ల ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ కోసం సెపరేట్ గా రీఛార్జిలు కూడా చేసుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాలలో మనం ఇంటర్నెట్ ఎక్కువ ఉపయోగించకపోయినా కూడా డేటా అయిపోతూ ఉంటుంది.

 మనం తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇలా మనం డేటా ఉపయోగించకపోయినా కూడా డేటా పూర్తవుతూ ఉంటుంది.

 అయితే ఇలా ఇంటర్నెట్ తొందరగా పూర్తవకుండా ఉండటానికి మన మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

 • ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. • సెట్టింగ్స్ లో నెట్వర్క్ ప్రిఫరెన్సె(Network Preference) అనే ఆప్షన్ ని ఓపెన్ చెయ్యాలి.

 • ఇది ఓపెన్ చెయ్యగానే యాప్ డౌన్లోడ్ ప్రిఫరెన్సెస్, ఆటో అప్డేట్ యాప్స్(Auto-update apps), ఆటో ప్లే వీడియోస్(Auto-Play Videos) అని అక్కడ మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.

 • అందులో ఆటో-అప్డేట్ యాప్స్ ఓపెన్ చెయ్యాలి. ఈ ఆటో అప్డేట్ యాప్స్ ఓపెన్ చేసినపుడు ఓవర్ ఎనీ నెట్వర్క్(Over Any Network), ఓవర్ వైఫై ఓన్లీ(Over wi-fi Only),

 డోంట్ ఆటో అప్డేట్ యాప్స్(Don’t Auto-update apps) అని మూడు ఆప్షన్స్ కనబడతాయి. • వీటిలో ఓవర్ ఎనీ నెట్వర్క్ ఆన్ లో ఉంటే యాప్స్ ను మీరు అప్డేట్ చెయ్యకపోయినా వాటికవే అప్డేట్ అయిపోతాయి.

 • వై ఫై ఓన్లీ అనే ఆప్షన్ ఉంటే వై ఫై కనెక్షన్ ఉన్నప్పుడు మొబైల్ లో యాప్స్ వాటికవే అప్డేట్ అవుతాయి. అదే డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే యాప్స్ వాటికవే అప్డేట్ కాకుండా ఉంటాయి.

 • ఈ ఒక్క సెట్టింగ్ మార్చుకుంటే చాలావరకు డేటా మీ ప్రమేయం లేకుండా ఖర్చవడాన్ని నిరోధించవచ్చు.