“మైఖేల్” కి మంచి ఓపెనింగ్సే వచ్చాయే.!

 ఈ ఏడాది సంక్రాంతి తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో శుక్రవారాల్లో సరైన సినిమా అయితే పడలేదు.

 కానీ ఈ వారం మాత్రం కాస్త హోప్స్ మధ్య వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్

 హీరోగా నటించిన సినిమా “మైఖేల్” పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింది.

 అయితే ఇది డీసెంట్ బజ్ తోనే వచ్చింది కానీ అనూహ్యంగా సరైన టాక్ మాత్రం తెచ్చుకోలేకపోయింది.

 కానీ ఈ చిత్రం మాత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా మంచి ఓపెనింగ్స్ నే నమోదు చేసినట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ చెప్పడం విశేషం.

 ఇక ఈ సినిమా అయితే మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి 4.6 కోట్ల గ్రాస్ ని అందుకుంది అట.. ఇది సందీప్ కిషన్ కెరీర్ లో ఈ మధ్య కాలంలో బెస్ట్ కావచ్చు.

 కానీ ఇక రెండో రోజు నుంచి వసూళ్లు ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది. ఇవి కూడా ఆశాజనకంగా వస్తే ఈ సినిమా హిట్ అయినట్టే.

 కాగా ఈ సినిమాని కొత్త డైరెక్టర్ రంజిత్ జేయకొడి దర్శకత్వం వహించగా తమిళ స్టార్ నటులు విజయ్ సేతుపతి మరియు గౌతమ్ మీనన్ తదితరులు నటించారు.

 అలాగే హీరోయిన్ మజిలీ ఫేమ్ దివ్యాంషా కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

 అలాగే సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహించారు.