నిర్మొహమాటంగా అయితే టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్రేజ్ ఉన్న ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ
పరంపర ని అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిజంగా అందనంత ఎత్తుకి తీసుకెళ్లిన సిసలైన వారసుడుగా నిలిచాడు అని చెప్పాలి.
విలక్షమైన సినిమాలతో పాత్రలతో అంతకంతకు తాను ఎదిగాడు. అయితే మెగా ఫ్యామిలీ పట్ల తెలుగు మీడియాలో అంత సఖ్యత ఎప్పుడూ చూపించింది.
లేదు న్యూట్రల్ గా చూపించి ఉండొచ్చు కానీ మెగా హీరోలు కానీ మెగా ఫ్యామిలి కానీ ఏదైనా అరుదైన ఘనత అందుకున్నప్పుడు ఓ సెక్షన్ మీడియా వారి కోసం వేసిన పాపాన పోరు.
అలాగే రీసెంట్ గా రామ్ చరణ్ కి మొట్ట మొదటి సారిగా అమెరికా ఫేమస్ టీవీ షో కి ఆహ్వానం రావడం ఆసక్తిగా మారింది.
ఇది చిన్న విషయం కూడా కాదు ఇండియన్ సినిమా దగ్గర ఏ నటుడికి కూడా ముందు జరగలేదు అలాగే దీనికి ముందు కూడా మరో ఫేమస్ హాలీవుడ్ అవార్డు వేడుకకి కూడా చరణ్ కి ఆహ్వానం వచ్చింది.
అలాగే జేమ్స్ కామెరాన్ లాంటి దిగ్గజ దర్శకుడు కూడా చరణ్ రోల్ ని కొనియాడారు. అప్పటికీ కూడా పెద్దగా చరణ్ పై కథనాలు మీడియాలో పడింది లేదు.
దీనితో ఫైనల్ గా తన కొడుకు కోసం తానే మీడియా గా మారారు. మెగాస్టార్. హాలీవుడ్ మీడియా దగ్గర కామెరాన్ చరణ్ పాత్ర కోసం మాట్లాడిన క్లిప్ ని
తాను షేర్ చేసి ఆనందం వ్యక్తం చేయగా మరోసారి చరణ్ కి దక్కిన ఆహ్వానం ని కూడా తానే తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
దీనితో మెగా ఫ్యాన్స్ ఈ విషయంలో మాత్రం మెగాస్టార్ తగ్గకూడదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటు మిగతా హీరోలకి వారి అను’కుల’ మీడియాలు ఊదరగొట్టినపుడు
ఇలా సొంతంగా తన కొడుకు కోసం చిరంజీవి చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.