మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమా అవకాశాలతో దూసుకు పోతున్నారు.
ఈ క్రమంలోనే ఈయన నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధం కాగా మరో మూడు సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి.
ఇక కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీన విడుదల కానుంది.
ఇకపోతే రామ్ చరణ్ మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడమేకాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు పొందారు.
ఇక రామ్ చరణ్ బాటలోనే మెగాస్టార్ కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.
ఈ క్రమంలోనే సుస్మిత మెగాస్టార్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు.
ఇలా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న సుస్మిత తాజాగా గోల్డ్ బాక్స్ అనే ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఒక వెబ్ సిరీస్ నిర్మించారు.
ఇక ఈ వెబ్ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాను కూడా గోల్డ్ బాక్స్ నిర్మాణంలో తెరకెక్కించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుస్మితకు ఎంతోమంది మెగా హీరోలు ఉండగా ఈమె పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తన గోల్డ్ బాక్స్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సరైన కథ దర్శకుడు దొరికితే గోల్డ్ బాక్స్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా పట్టాలేక్కనుంది.
అయితే మెగాస్టార్ తో సినిమా అంటే సుమారు 60 నుంచి 80 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది.
అంత భారీ బడ్జెట్ సినిమా అంటే సుస్మిత నిర్మాణంలో కుదరదు కనుక సుస్మిత కోసం మెగాస్టార్ చిరంజీవి ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.