పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మెగాస్టార్… ? 

 మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు.

 ఇక ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాని మెగాస్టార్ చేస్తున్నాడు.

 ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా నటిస్తూ ఉండగా తమన్నా హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

 ఇదిలా ఉంటే ఈ సినిమాని ఆగష్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

 ఎనిమిదేళ్ళ క్రితం తమిళంలో వచ్చిన వేదాళం రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

  ఇదిలా ఉంటే ఈ సినిమాని ఒరిజినల్ వెర్షన్ లా కాకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా అందించే ప్రయత్నం మెహర్ రమేష్ చేస్తున్నారు.

 ప్రెజెంట్ నేటివిటీకి తగ్గట్లుగా కథలో మార్పులు కూడా చేసి మెగాస్టార్ ని ఒప్పించాడు. దీంతో మెగాస్టార్ కూడా పచ్చజెండా ఊపేశాడు.

 ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

 ఫ్యాన్ గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్స్ లో ఒక పాటని భోళా శంకర్ కోసం రీమిక్స్ చేయడానికి

 కూడా ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక వేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఈ సినిమాలో చిరంజీవి కనిపిస్తే మాత్రం

 ఇక మెగా ఫ్యాన్స్ కి మరోసారి పూనకాలు వచ్చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.మెగాస్టార్ ఇమేజ్ తో పవర్ స్టార్ తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

 అలాంటిది పవర్ స్టార్ ఫ్యాన్ బాయ్ గా చిరంజీవి కనిపించడం అంటే మామూలు విషయం కాదు.

 ఈ న్యూస్ బయటకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వేళ ఈ వార్త నిజమైతే మాత్రం భోళా శంకర్ బ్లాక్ బస్టర్ కావడం పక్కా అనే మాట వినిపిస్తుంది.