“సార్” విషయంలో మెగా ఫ్యాన్స్ గుస్సా.??

 ఈ ఏడాదిలో టాలీవుడ్ నిహంగా ఓ సూపర్ సక్సెస్ తో స్టార్ట్ అయ్యి అదే హవా ఇప్పుడు కనబరుస్తుంది అని చెప్పాలి.

 కాగా గత నెల సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రాల్లో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా భారీ సక్సెస్ అందుకోగా

 ఇక ఈ ఫిబ్రవరి నెలలో చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చి సూపర్ హిట్ టాక్ అందుకున్న సినిమా నటుడు ధనుష్ నటించిన సినిమా “సార్” కూడా ఒకటి.

 ఐతే ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది హిట్ అయ్యింది బాగానే ఉంది కానీ ఈ సినిమా విషయంలో కొందరు మెగా ఫ్యాన్స్ ఎందుకు కోపంగా ఉన్నారు అనే టాక్ మొదలైంది.

 అయితే ఈ మాట నిజమేనట. మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య తన కెరీర్ లో మళ్ళీ మంచి హిట్ గా నిలిచి తన స్టార్డం కి తగ్గట్టుగా హిట్ గా నిలిచింది.

 దీనితో సినిమా 50 రోజుల రికార్డులు కోసం చాలా మంది చూసారు. కానీ అనేక చోట్ల సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నప్పటికీ

  ధనుష్ సార్ సినిమా కోసం వాల్తేరు వీరయ్య ని తీసేశారట. దీనితో 50 రోజుల సెంటర్స్ మిస్ అయ్యిపోయాయ్ అని మెగా ఫ్యాన్స్ బాధ.

 దీనితో ఈ కారణం చేత మెగా ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో గుస్సా గా ఉన్నారట. అయితే ఇది ఎప్పుడూ కూడా సర్వ సాధారణమే కానీ

 చిరు మళ్ళీ తన రేంజ్ హిట్ అందుకున్నాక  గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుందాం అని వారు అనుకున్నారు కానీ ఇలా అయ్యింది అని వారి బాధ.