మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే కాకుండా నిహారిక కొణిదెల హీరోయిన్ గా కూడా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.
తరువాత నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు నిర్మించడం స్టార్ట్ చేసింది. ఇక మెగాస్టార్ కూతురు సుస్మిత కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
తర్వాత నిర్మాతగా మారి సూట్ అవుట్ ఎట్ ఆలేరు అనే వెబ్ సిరీస్ ని నిర్మించింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ కాలేదు.
తరువాత సేనాపతి అనే వెబ్ సిరీస్ నిర్మించి ఓటిటిలో రిలీజ్ చేసింది. ఈ వెబ్ సిరీస్ కూడా మరీ డ్రమటిక్ గా ఉందని టాక్ సొంతం చేసుకుంది.
ఇక మూడో ప్రయత్నంగా సంతోష్ శోభన్ హీరోగా శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాని నిర్మించింది. ఇది కూడా రొటీన్ అవుట్ డేటెడ్ స్టోరీతో తెరకెక్కిన చిత్రంగా ప్రేక్షకుల నుంచి విమర్శలు సొంతం చేసుకుంది.
కంటెంట్ సెలక్షన్స్ లో సుస్మిత ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయలేకపోయిందని మాట వినిపిస్తుంది.
కాస్ట్యూమ్ డిజైనర్ గా సక్సెస్ అయిన నిర్మాతగా మాత్రం ఇంకా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఇక నిహారిక కొణిదల కూడా నాన్న కూచి అనే వెబ్ సిరీస్ ని నిర్మించింది. అయితే అది ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ తో కొంతవరకు మెప్పించింది.
మరల హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ నిర్మించిన అది ఏ వర్గం ప్రేక్షకులకి కూడా కరెక్ట్ కాలేదు. ఇలా మెగా ఫ్యామిలీ అక్క చెల్లెలు ఇద్దరు కూడా నిర్మాతలుగా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు అని చెప్పాలి.
ప్రస్తుతం బాలీవుడ్లో చాలామంది కొత్తవాళ్లు ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. అవి ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతున్నాయి.
అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ లో ఇష్టపడుతున్నారు. అందులో డ్రామా ఉన్నా కూడా ఒటీటీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే విధంగా కంటెంట్ ఉండడంతో కనెక్ట్ అవుతున్నారు.
అలాంటిది మెగా డాటర్స్ మాత్రం కొత్త కథలను ముడిసి పట్టుకోవడంలో కొంత విఫలం అవుతున్నారని మాట ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తుంది.