ఈ ఒక్క ఫోటోతో ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్… ఫోటో వైరల్!

 సాధారణంగా ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా మెగా కుటుంబం అల్లు కుటుంబం ఒకే చోట చేరి పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు.

 ఈ సాంప్రదాయం ఈ తరం నుంచి వచ్చినది కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు మెగా కుటుంబంలో జరుగుతోంది.

 ఒక ఈవెంట్ మెగా కుటుంబంలో జరగగా మరొక ఈవెంట్ అల్లు కుటుంబంలో జరుగుతూ ఉంటుంది.

 ఈ క్రమంలోనే గత దీపావళి పండుగ సందర్భంగా అల్లు అర్జున్ ఇంట్లో పెద్ద ఎత్తున మెగా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు సందడి చేశారు.

 ఇక తాజాగా సీక్రెట్ శాంట అంటూ మరోసారి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని కూడా ఘనంగా జరుపుకున్నారు.

 ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి యంగ్ స్టార్స్ అందరూ కూడా ఒకే చోటకు చేరి పెద్ద ఎత్తున సీక్రెట్ శాంటాను జరుపుకున్నారు.

 ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలు మరికొన్ని అనుమానాలకు కూడా కారణం అవుతుంది.

 గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ ఫోటోతో తాను ప్రెగ్నెంట్ కాదంటూ అందరికీ క్లారిటీ వచ్చింది.

 ఇలా నిహారిక ప్రెగ్నెంట్ కాకపోయినప్పటికీ ఈమె భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య గత కొంతకాలంగా మెగా కుటుంబంతో కలిసి ఏ ఈవెంట్లలోను పాల్గొనలేదు.

  దీంతో అభిమానులకు మరొక కొత్త సందేహం కలుగుతుంది. మెగా డాటర్ నిహారిక ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్తున్నారు.

 వెకేషన్ కి వెళ్ళిన స్నేహితులతో కలిసి వెళ్లడం అలాగే మెగా కుటుంబంలోని ఫంక్షన్లకు వెంకట చైతన్య లేకుండా సింగిల్ గా హాజరవడంతో ఈ అనుమానాలకు కారణం అవుతున్నాయి.

 దీపావళి సెలబ్రేషన్స్ లో కూడా నిహారిక ఒకటే పాల్గొన్నారు ఇక సీక్రెట్ శాంట సెలబ్రేషన్స్ లో కూడా చైతన్య లేకుండా నిహారిక ఒక్కటే ఉండడంతో ఏదో తేడా కొడుతుందని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.