జనసేనానికి మెగా సలహా.! పొత్తుల విషయంలో ఏం చెప్పారట.?

 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది.

 అయితే, ఈ విషయమై ఇంకా అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి వుంది. మరోపక్క, టీడీపీ – జనసేన కలిస్తే, తాము ఏం చేయాలన్నదానిపై భారతీయ జనతా పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.

 ‘ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకున్నా ముఖ్యమంత్రి అభ్యర్థి మాత్రం పవన్ కళ్యాణే..’ అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు.

 ఇంతకీ, మెగాస్టార్ చిరంజీవి ఏమనుకుంటున్నారు.? తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా చిరంజీవి ఇచ్చిన సలహా ఏంటి.?

 రాజకీయాల విషయమై తాము అస్సలు మాట్లాడుకోబోమనీ, తాను రాజకీయాలకు దూరమనీ మెగాస్టార్ చిరంజీవి తరచూ చెబుతున్నారు.

 కానీ, తమ్ముడు వచ్చి అడిగితే, చిరంజీవి సలహా ఇవ్వకుండా వుంటారా.? ఇచ్చారట.. మంచి సలహానే ఇచ్చారట.!

 ‘టీడీపీతో వెళితే వెన్నుపోటు తప్పదు.. ఒంటరిగా వెళితే, ప్రజల్లో గౌరవం అయినా దక్కుతుంది

  2019 ఎన్నికల్లో ఓడినా, జనసేనకు గౌరవం దక్కడానికి కారణం ఒంటరి పోరాటం వల్లనే..’ అని చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కి సూచించారట.

 వైసీపీ దూషణల కంటే, టీడీపీ అవమానాలు దారుణంగా వుంటాయని చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కి స్వీయ అనుభవంతో చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

  నిజమేనా.? ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి, తమ్ముడికే అయినా రాజకీయంగా సలహాలు ఇచ్చే అవకాశముందా.?