తెలుగు చిత్ర పరిశ్రమలోకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోయిన్ గా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మీనా అందరికీ సుపరిచితమే.
వివాహం తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు.
ఇక తన లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది అనుకున్న క్రమంలో తన భర్త మరణం తనని ఎంతగానో కృంగదీసింది.
మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే.
అయితే తన భర్త మరణించిన తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే భర్త మరణం తర్వాత మొదటిసారి ఈమె కెమెరా ముందుకు రాబోతున్నారు.
ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలకు కమిట్ అయినటువంటి మీనా తన తదుపరి సినిమాల రెమ్యూనరేషన్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
తన భర్త మరణంతో తన కుమార్తె బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని మీనా రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఈమె ఒక్కో సినిమాకి సుమారు 20 లక్షల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట.
తన పాత్ర కోసం 20 లక్షల డిమాండ్ చేయడం అంటే భారీ రెమ్యూనరేషన్ అని నిర్మాతలు భావిస్తున్నారు.
ఇక మీనా 20 లక్షలు డిమాండ్ చేసినప్పటికీ నిర్మాతలు ఈమెకు తమ సినిమాలలో అవకాశం కల్పిస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ దృశ్యం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.