మహిళల కోసం ప్రత్యేకంగా మహిళ సమ్మాన్ సేవింగ్స్ స్కీం… ఈ స్కీం ద్వారా 32 వేలు పొందవచ్చు తెలుసా?

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం ఎన్నో రకాల పథకాలను తీసుకువచ్చింది.

 ఇలా కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిన ఈ పథకాల ద్వారా మహిళలు ఎంతో లబ్ధి పొందుతున్నారు

  అయితే తాజాగా 2023 -24 బడ్జెట్లో భాగంగా సరికొత్త పథకాన్ని మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చారు ఈ పథకం ద్వారా మహిళల 32 వేల రూపాయలను పొందవచ్చు.

 ఇలా మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఈ పథకం మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని పురస్కరించుకొని మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను అమలులోకి తీసుకువచ్చింది ఈ స్కీం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.

 ఈ స్కీం ద్వారా మహిళలు రెండు లక్షల రూపాయల వరకు డబ్బును దాచుకోవచ్చు.

 ఈ స్కీం టెన్యూర్ రెండేళ్లు. 7.5 శాతం వడ్డీ ఈ స్కీమ్ తో వస్తుంది. స్కీమ్ లో డబ్బులు పెట్టి మహిళలు పాక్షిక విత్‌డ్రాయెల్ ఫెసిలిటీ ని పొందవచ్చు.

 ప్రభుత్వం ఈ స్కీమ్‌ బెనిఫిట్స్ సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియచేయనుంది. ఈ స్కీం ద్వారా 7.5 శాతం వడ్డీ వస్తోంది. ఇందులో మీరు రూ.

2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 15,427 వస్తాయి. రెండేళ్లకు రూ. 32,044 వస్తాయి.

 అంటే రూ. 2 లక్షల ఇందులో డిపాజిట్ చేస్తే మీకు 32000 ఆదాయాన్ని పొందవచ్చు.