మంచు మనోజ్ రెండో పెళ్ళికి రెడీ..డేట్ వైరల్.!

 టాలీవుడ్ లో ఉన్న పలు ప్రిస్టేజియస్ సినీ కుటుంబాల్లో మంచు వారి కుటుంబం కూడా ఒకటి.

 మరి ఈ కుటుంబం నుంచి ఆల్రెడీ పలు సినిమాలు గత ఏడాదిలో రాగా వీరి నుంచి కాస్త ప్రామిసింగ్ హీరో మాత్రం మంచు మనోజ్ అని చెప్పాలి.

 ఆడియెన్స్ లో కాస్తో కూస్తో మంచి పేరున్న హీరో మంచు మనోజ్ కాగా తాను ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ చాలా కాలం తర్వాత ఇచ్చాడు.

 అయితే తన పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని డిస్టబెన్స్ లు మూలాన తన మొదటి భార్య నుంచి వేరయ్యి మళ్ళీ ఒంటరి జీవితంలోకి వచ్చాడు.

 మరి ఆ తర్వాత కూడా తన రిలేషన్ పై పలు రూమర్స్ కూడా వచ్చాయి. మళ్ళీ తాను పెళ్లి చేసుకుంటాడని రూమర్స్ కూడా రాగా తాను అప్పట్లో వాటిని ఖండించాడు కూడా.

 కానీ ఇప్పుడు ఫైనల్ గా అయితే తన నుంచి గుడ్ న్యూస్ అంటూ ఓ తాజా పోస్ట్ చేయడం వైరల్ గా మారింది.

 గత కొన్ని రోజులు నుంచి నా హృదయంలో ఓ గుడ్ న్యూస్ ని పట్టి ఉంచానని అలాగే నా జీవితంలో కొత్త దశలోకి అడుగు పెట్టడానికి చాలా ఎగ్జైటెడ్ గా కూడా ఉన్నానని తాను తెలిపాడు.

 ఇక దీనితో పాటుగా ఈ జనవరి 20న ఆ న్యూస్ అనౌన్స్ చేస్తాను మీ అందరి ఆశీస్సులు తప్పకుండ కావాలి అంటూ పోస్ట్ చేసాడు.

 దీనితో ఈ పోస్ట్ మంచి వైరల్ గా మారింది. మరి ఆమె ఎవరో.. ఇది వరకు అనుకుంటున్నా ఆమేనా అనేది తెలియాలి అంటే ఈ 20 వరకు ఆగాల్సిందే.