మంచు లక్ష్మి.. ఈసారైనా హిట్టొచ్చేనా?

 టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్గా గుర్తింపు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మీ. తండ్రి మోహన్ బాబు నుంచి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ.. నటిగానే కాకుండా నిర్మాతగా వ్యాఖ్యాతగా కూడా కెరీర్​లో రాణిస్తోంది.

 అయితే ఈ జర్నీలో పలుసార్లు ట్రోల్స్ కు కూడా గురైంది. అయితే ఎవరేమనుకున్నా అనుకున్నది పక్కాగా చేసేసే లక్ష్మక్క..

 ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి వెబ్​సిరీస్​పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.

 చివరిగా గతేడాది మలయాళంలో మోహన్ లాల్ మాన్​స్టర్​ మూవీలో లెస్బియన్ పాత్రలో కనిపించింది. అలా ఈ చిత్రంలో మరో నటితో లిప్ లాక్ చేసి విమర్శలకు గురైంది.

 ఇక విషయానికొస్తే విలక్షణమైన నటిగా లక్ష్మీ పేరు తెచ్చుకున్నప్పటికీ ఆమెకు ఇప్పటి వరకు సరైన సక్సెస్​ దక్కలేదు. అయినా ఆమె ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.

 తన తండ్రి బ్యానర్ లక్ష్మీ ప్రోడక్షన్స్ లో సినిమాలు చేస్తోంది. హిట్ ఫ్లాప్ల తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ చిత్రాల్లో నటిస్తూనే ఉంది.

 అయితే వీటిలో ఒక్క చిత్రం కూడా సరైనా బ్లాక్ బస్టర్ హిట్​ను అందుకోలేదు. ఇంకా చెప్పాలంటే పెట్టుబడులు కూడా రాలేదని టాక్ నడిచింది.

 అయితే ఆమె మళ్లీ ధైర్యం చేసి తాజాగా అదే బ్యానర్​లో తన తండ్రి మోహన్‌ బాబుతో కలిసి ‘అగ్ని నక్షత్రం’ అనే థ్రిల్లర్​ సినిమా చేసింది.

  దర్శకుడు ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కథ డైమండ్‌ రత్నబాబు అందించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్లు జరుపుకుంటుంది.

 ఈ సందర్భంగా తాజాగా గ్లింప్స్‌ వీడియోను హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం యాక్షన్​ సన్నివేశాలతో సాగింది. ఇందులో లక్ష్మి పోలీస్​ ఆఫీసర్​గా కనిపించింది.

 ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వంత్‌, చిత్రా శుక్లా, సముద్రఖని, సిద్ధిఖ్‌లు నటిస్తున్నారు. లిజో కె జోస్‌ సంగీతం అందిస్తున్నారు.

 మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది అయినా హిట్​ అయి సినిమాలు లాభాలు తెస్తుందో లేదో.