పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఓ శాఖ పెట్టుకోండి…. వైసీపీ మంత్రులపై ఆది సెటైర్స్!

 జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్గా గుర్తింపు పొందిన అది ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. అది స్వతహాగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే.

 స్వయంగా ఆది ఈ విషయాన్ని ఎన్నో సందర్భాలలో వెల్లడించాడు. ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన యువశక్తి సభలో హైపర్ ఆది పాల్గొని వైసీపీ మంత్రులపై సెటైర్లు వేశాడు.

 ఈ సభలో హైపర్ ఆది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ, వైసీపీ మంత్రుల గురించి విమర్శలు చేశాడు.

  పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పనిని వైసిపి మంత్రులు పనిగట్టుకొని విమర్శిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

 ఇక ఈ విషయం గురించి హైపర్ ఆది స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారిని తిట్టటానికి ఆ శాఖ ఈ శాఖ అని అన్ని పేర్లు ఎందుకు?

 ఆయన్ని తిట్టడానికి ప్రత్యేకంగా ఒక శాఖ పెట్టుకోండి అంటూ వైసీపీ మంత్రులకు చురకలు అంటించాడు.

 పవన్ కళ్యాణ్ అభిమానిగా ఇక్కడికి రాలేదని జనసేన సిద్ధాంతాలు నచ్చి.. ఆ పార్టీలో తానొక అభ్యర్థిలాగ మాట్లాడడానికి వచ్చానని హైపర్ ఆది వెల్లడించాడు.

 ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన తప్ప.. మోసం చేయాలన్న ఆలోచన లేని రాజకీయ నాయకులతో ఉన్న సభను మొదటిసారిగా చూస్తున్నాను.

 ఈ సభకి వచ్చిన జనాలను చూసి కొంతమంది ఇప్పటికే సగం చచ్చిపోయి ఉంటారు అంటూ వైసిపి, మంత్రులు కార్యకర్తలను ఉద్దేశిస్తూ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 పవన్ కళ్యాణ్ డబ్బు, కోసం అధికారం కోసం ఆశపడి రాజకీయాలలోకి రాలేదని కేవలం ప్రజలకు సేవ చేయాలనే అంకిత భావంతో రాజకీయాలలోకి అడుగుపెట్టాడని వెల్లడించాడు.

 కౌలు రైతుల కష్టాలు తీర్చడం కోసం మాత్రమే ఒక సినిమా చేయటానికి ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి హైపర్ ఆది వెల్లడించాడు.

 పవన్ కళ్యాణ్ లాంటి డబ్బు పట్ల ఆశ లేని వ్యక్తి అధికారంలోకి వస్తే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకు అందేలా చేస్తాడని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

 రెండుసార్లు ఓడిపోయారు అని వైసిపి కార్యకర్తలు చేసిన విమర్శలకు హైపర్ ఆది స్పందిస్తూ.. రెండుసార్లు ఓడిపోతేనే ప్రజలకు ఇంత మంచి చేశాడు.

  అలాంటిది అధికారంలోకి వస్తే కష్టాన్ని వాళ్ళ కాంపౌండ్ వాల్ కూడా దాటేనివ్వడు అంటూ పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచేశాడు.