సినీ వర్గాలని షేక్ చేస్తున్న మహేష్ – రాజమౌళి సినిమా అప్డేట్.!

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అయితే ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక దీనిపై భారీ స్థాయి అంచనాలు ఉండగా దీనిని అయితే మేకర్స్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత అయితే రాజమౌళి తో మహేష్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఇది అయితే ఏకంగా పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్ కి కూడా వెళ్లేలా ఉంది. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాకి గ్లోబ్ టాటరింగ్ సినిమాగా ఉంటుంది అని రాజమౌళి కన్ఫర్మ్ చేశారు.

ఇక లేటెస్ట్ గా అయితే సోషల్ మీడియా సహా సినీ వర్గాల్లో ఓ క్రేజీ అప్డేట్ పెద్ద ఎత్తున షేక్ చేస్తుంది.

ఈ సినిమాకి కథ డెవలప్ చేస్తున్న పాన్ ఇండియా రచయితా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ సినిమాని ఓ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ లా ప్లాన్ చేసే అవకాశం ఉందని వెల్లడి చేశారు.

అంతే కాకుండా ఇప్పుడు తన టీం తో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారని తెలిపారు. దీనితో ఈ క్రేజీ అప్డేట్ సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.

ఇక ఈ సినిమా అయితే వచ్చే ఏడాది సమ్మర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది. అలాగే ఇది కంప్లీట్ ఏక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.