మహేష్, త్రివిక్రమ్ సినిమా ఓటిటిలో రిలీజ్ అప్పుడేనట.!

 టాలీవుడ్ ఎవర్ గ్రీన్ ఛార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు పూజా హెగ్డే మరియు

 శ్రీ లీల లు హీరోయిన్స్ గా నటిస్తున్న భారీ సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

 అయితే ఈ సినిమాలో రీసెంట్ గానే రెండో షెడ్యూల్ షూటింగ్ ని అయితే స్టార్ట్ చేసుకోగా ఈ సినిమాపై లేటెస్ట్ గా పలు సంచలన వార్తలు సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

 మరి వాటితో అయితే ఈ సినిమాని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఏకంగా 80 కోట్లు వెచ్చించి అన్ని భాషల హక్కులు తీసుకున్నారని తెలిసింది.

 అయితే దీనిపై సినీ వర్గాల్లో లేటెస్ట్ గా క్లారిటీ కూడా వచ్చింది. దీనితో అయితే ఈ సినిమాకి ఆ డీల్ వాస్తవమే కాగా దీనితో పాటుగా

 ఈ సినిమా ఓటిటి లో ఎప్పుడు నుంచి అందుబాటులో ఉంటుంది అనేది కూడా బయటకొచ్చింది.

  ఈ సినిమా అయితే థియేట్రికల్ రిలీజ్ తర్వాత సుమారు 50 రోజుల తర్వాత మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యేలా అయితే డీల్ ని కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది.

 దీనితో ఈ అవైటెడ్ సినిమా పై బయటకొచ్చిన న్యూస్ నిజమే అని చెప్పొచ్చు. కాగా ఈ భారీ సినిమాని మేకర్స్ 200 కోట్లకి పైగా బడ్జెట్ తో ప్లాన్ చేస్తుండగా

 థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే రమ్య కృష్ణ కూడా కీలక పాత్ర చేస్తున్నట్టు మరో రూమర్ ఉంది.