నేను మహేష్ ఆ డీల్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాం… అసలు విషయం బయటపెట్టిన నమ్రత!

నటిగా మహేష్ బాబు భార్యగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నమ్రత ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందినప్పటికీ పెళ్లయిన తర్వాత ఈమె ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.

ఇలా మహేష్ బాబు తో కలిసి వంశీ సినిమాలో నటించిన ఈమె ఈ సినిమాతోనే ఇతనితో పరిచయం ఏర్పరచుకొని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ వీరి ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి ఎంతో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఇలా వివాహం తర్వాత నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పారు.

సినిమాలకు దూరంగా ఉన్నటువంటి నమ్రత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఘట్టమనేని కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.

ఒక కోడలిగా ఒక భార్యగా తల్లిగా ఈమె తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

పెళ్లికి ముందు మహేష్ బాబు తాను తమ పెళ్లి విషయంలో ఒక డీల్ కుదుర్చుకొని పెళ్లి చేసుకున్నామని తెలిపారు.

పెళ్లికి ముందు ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో తాను పెళ్లి తర్వాత సినిమాలలో నటించనని తెలిపాను.మహేష్ బాబు కూడా అందుకు ఒప్పుకున్నారు.

పెళ్లి తర్వాత సినిమాలలో నటించకూడదని చెప్పడంతో మా ఇద్దరి మధ్య ఈ డీల్ కుదుర్చుకొని పెళ్లి చేసుకున్నామని

అందుకే తాను సినిమాలకు దూరంగా ఉన్నానని నమ్రత వీరి పెళ్లి సభలో జరిగిన ఈ డీల్ గురించి ఇప్పుడు బయట పెట్టారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.