రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరోస్ రామ్ చరణ్ ఎన్టీఆర్.
ఇలా వీరిద్దరూ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమాకు గాను ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.
ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు కలిసి చేసిన నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం మనకు తెలిసిందే.
అయితే ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడంతో ఆస్కార్ అవార్డుపై కూడా మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఇదివరకు ఎన్నో సినిమాలు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నవి ఆస్కార్ అవార్డును కూడా అందుకోవడంతో
తప్పనిసరిగా నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును కూడా అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆస్కార్ అవార్డుల జాబితాను జనవరి 24వ తేదీ ప్రకటించనున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాంచరణ్ కు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న నాటు నాటు ఆస్కార్ అవార్డు కనుక అందుకుంటే ఆస్కార్ వేదికపై డాన్స్ చేస్తారా అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానం చెబుతూ ఆస్కార్ అవార్డు రావాలి కానీ నేను తారక్ ఇద్దరు కలిసి ఆస్కార్ వేదికపై ఒకసారి కాదు 17 సార్లు అయినా డాన్స్ చేస్తాము అంటూ చెప్పుకొచ్చారు.