ప్రభాస్ “సలార్” పై అద్దిరిపోయే లేటెస్ట్ అప్డేట్స్.!

 ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ లో ఉన్నాడో తెలిసిందే.

 మరి తాను చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా “సలార్” కూడా ఒకటి కాగా శృతి హాసన్ హీరోయిన్ గా ఇందులో నటిస్తుంది.

 మరి ఈ సినిమా అయితే క్రేజీ ఏక్షన్ డ్రామాగా తెరకెక్కుతూ ఉండగా వచ్చే ఏడాది సెప్టెంబర్ రిలీజ్ కి రెడీ కాబోతుంది.

అయితే ఈ అవైటెడ్ భారీ థ్రిల్లర్ పై లేటెస్ట్ గా కొన్ని క్రేజీ అప్డేట్స్ వినిపిస్తున్నాయి.

 ఈ చిత్రం షూటింగ్ అయితే ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో నడుస్తుండగా ఆల్రెడీ 85 శాతం షూటింగ్ జరిగిపోయిందట.

 అలాగే వచ్చే ఏడాది మార్చ్ నాటికి షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యిపోగా దాదాపు మరో 5 నెలలు సినిమా గ్రాఫిక్స్ పని ఉంటుందట.

 దీనితో ఈ చిత్రం అనుకున్న సెప్టెంబర్ రిలీజ్ కి డెఫినెట్ గా వస్తుందని నిర్మాణ సంస్థ చెప్తుంది.

 అలాగే ఈ సినిమా నుంచి నిర్మాత విజయ్ కొన్ని రషెస్ చూడగా..

 తాను మరింత నమ్మకంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారట.

 అలాగే తమ బ్యానర్ నుంచి వచ్చిన అన్ని సినిమాల రికార్డులు బ్రేక్ చేసే విధంగా సలార్ వస్తుంది అని వారు అనుకున్నారట.

 ఇక దీనితో ఈ సినిమా ఏ లెవెల్లో ఉండనుందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ క్రేజీ డ్రామా ఎలా ఉంటుందో చూడాల్సిందే.