ఈ ఏడాది తమిళ సినిమా నుంచి వచ్చిన భారీ హిట్ చిత్రాల్లో అక్కడ ఓ హిస్టారికల్ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది “పొన్నియిన్ సెల్వన్” సినిమానే అని చెప్పాలి.
దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో పెద్దగా సక్సెస్ కాకపోయినా..
తమిళ నాట మాత్రం మరే ఇతర సినిమా ఇప్పట్లో టచ్ చెయ్యని విధంగా వసూళ్లు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఒక్క తమిళ్ లోనే మేజర్ గా వసూళ్లతో 500 కోట్ల మార్క్ ని ఈ చిత్రం సొంతం చేసుకోవడం విశేషం.
మరి చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి ఐశ్వర్య రాయ్, త్రిష సహా మరెందరో స్టార్స్ నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ పై అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ అవైటెడ్ అప్డేట్ ని అందించారు.
మణిరత్నం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా కూడా ఒకేసారి కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సినిమా డేట్ అయితే అనౌన్స్ అయ్యింది.
ఈచిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా పార్ట్ 2 తాలూకా సాలీడ్ గ్లింప్స్ వీడియో తో అయితే చిత్ర యూనిట్ ఇప్పుడు అనౌన్స్ చేశారు.
మరి ఇందులో ఏ ఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండగా చియాన్ విక్రమ్ సహా, కార్తీ తదితర నటులపై చోళ సామ్రాజ్యంపై చూపించిన విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
మరి దీనితో అయితే ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాని మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.